!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 404-406

  
వివేక చూడామణి 404-406 శ్లోకములు:

మనము భ్రాంతి కారణముగా అనాత్మ విషయాలని ( దేహము అహంకారము మొదలగునవి) ఆత్మ అని భావించి సంసార సాగరములో మునిగి తేలుతూ వుంటాము.   మరి  ఆ భ్రాంతినాశనమైపోతే , అంటే ఆ అజ్ఞానము నాశనమైపొతే ఇంక నిర్వికార నిరాకార నిశ్శేషము లేని ( విభజింపబడలేని) ఏక వస్తువులో ద్వైతము ( రెండవది , లేక భేదము) ఎలా కనిపిస్తుంది?  సమాధానము అజ్ఞానము నాశనమైపోయినప్పుడు ఏక వస్తువులో ద్వైతభావము లేదు అని స్పష్టముగా తెలుస్తుంది అన్నమాట.

ముందు మూడు శ్లోకాలలో  ( 404-406) కూడా - అద్వైత స్వరూపము  (ఏక వస్తువు) అయిన బ్రహ్మములో ద్వైతభావము లేదు అని చెప్పడానికి , బ్రహ్మము మీద ఉపమానములు చెపుతూ - అట్టి  - నిర్వికారమైన, నిరాకారమైన, నిర్విశేషమైన బ్రహ్మములో భిన్నత్వము ఎక్కడ - ఆనే ప్రశ్న లేక అలాంటి ఉదాహరణతో  గురువు బ్రహ్మము యొక్క అద్వైత స్వరూపామును మళ్ళీ మళ్ళీ మనకి చెపుతాడు ఈ మూడు శ్లోకాలలో .

శ్లోకము 404

ఏకాత్మకే పరే తత్వే  భేదవార్తా కథం వసేత్।
సుషుప్తౌ సుఖమాత్రాయాం భేదః కేనావలోకితః॥

1 ఏకాత్మకే పరే తత్వే  -
ఏకాత్మ రూపమైన పరబ్రహ్మ తత్త్వము నందు;

2 భేదవార్తా కథం వసేత్ -
విభిన్నత్వభావము ఎట్లు నివశించగలదు;

నిర్వికార నిరాకార ఒకే వస్తువులో - ఆ వస్తువులో (వికారములు) మార్పులు లేవు , ఆ వస్తువుకు రూపము లేదు, ఆ వస్తువుని ఖండించబడలేనిది ( రెండు ముక్కలు గా చేయబడలేనిది) అయినప్పుడు  విభిన్నత్వము అన్న మాట లేదు. అది నిజము.

ఒకవేళ భిన్నత్వము వుంది అనుకుంటే అది మూడు కాలలో వుండాలికదా. దానికి గురువు గాఢనిద్ర గురించి చెపుతాడు.

3 సుషుప్తౌ సుఖమాత్రాయాం-
గాఢనిద్రలో ( జీవుడు) సుఖమాత్రునిగా వున్నప్పుడు

4 భేదః కేన అవలోకితః -
ఎవడు ఈ భిన్నత్త్వము చూడగలుగుచున్నాడు?

OK . భిన్నత్త్వము వుంది అనుకుంటే , గాఢనిద్రలో ( జీవుడు) సుఖమాత్రునిగా వున్నప్పుడు ఎవడు ఈ భిన్నత్త్వము చూడగలుగుచున్నాడు? నిద్రలో చూడ వలసిన వాడు మనలో వుండే సాక్షి. దాని మీద విచారిద్దాము.

గాఢనిద్ర తరువాత నిద్రలో ఏమైంది అంటే సమాధానము బాగ నిద్రపట్టింది. నాకు వళ్ళు తెలియలేదు అన్నప్పుడు , అలా వళ్ళు తెలియలేదు అన్న సంగతి మనకి తెలిసినది. మనకి తెలిసినది అని అన్నప్పుడు అది మనలో వున్న సాక్షికి తెలిసింది. మనలో వున్న సాక్షి ఎవరు , అదే మన ఆత్మ. అంటే గాఢ నిద్రలో కూడా సాక్షి మాత్రమైన ఆత్మ అలాగే వున్నది అన్నమాట. ఇది ముఖ్యమైన మాట.

గాఢ నిద్రలో అన్ని ఇన్ద్రియములు నిద్రలో నిర్వీర్యమైనప్పుడు వాటికి విక్షేప శక్తి ( power of projection) లేదు. విక్షేప శక్తి లేనప్పుడు, అంటే లేని వాటిని భ్రాంతి లో కనపడేటట్టు చేసే శక్తి లేనప్పుడు - లేనివి కనపడవు ; లేనివి కనపడవు, కాని ఇంకేమన్నా వుంటే అలా వున్నవి కనపడాలి కదా. అంటే -  అప్పుడు గాఢనిద్రలో కూడా సాక్షిగా వున్న ఆత్మ,  ఆత్మ కన్న భిన్నమైనది ఏమన్న వుంటే సాక్షిగా చూడగలగాలి. ఆ సాక్షి ఏమీ చూడనప్పుడు ( నాకు నిద్రలో ఏమి తెలియదు అన్నప్పుడు), ఆత్మ కన్న  భిన్నమైనది ఏదీ ( ప్రపంచము) లేదు అని విశదమౌతుంది. అదే ఈ శ్లోక తాత్పర్యము.

404 వ శ్లోక తాత్పర్యము:

ఏకాత్మ రూపమైన పరబ్రహ్మ తత్త్వము నందు విభిన్నత్వభావము ఎట్లు నిలువగలదు? గాఢనిద్రలో ( జీవుడు) సుఖమాత్రునిగా వున్నప్పుడు , ఎవడు ఈ భిన్నత్త్వము చూడగలుగుచున్నాడు?

అజ్ఞానము పోయి , బ్రహ్మ జ్ఞానము కలిగినప్పుడు, ఇక భేదము అన్న మాటలేనే లేదు. అలా ఏమన్నా కనిపిస్తే అది - త్రాడులో లేకపోయినా కనపడే పామో; లేక ఎడారిలొ లేకపోయినా కనపడే నీటిచుక్కో అవ్వాలి.   ఆ మాట ముందు శ్లోకములో

శ్లోకము 405

న హ్యస్తి విశ్వం పరతత్త్వబోధాత్
సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే।
కాలత్రయే నాప్యహిరీక్షితో గుణే
న హ్యంబుబిన్దుః  మృగతృష్ణికాయామ్॥

1 న హి అస్తి విశ్వం పరతత్త్వబోధాత్ -
పరతత్త్వ బోధన తరువాత ఈ విశ్వము లేదు కదా; 

2 సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే -
సత్ స్వరూపమైన  నిర్వికల్పమైన బ్రహ్మము నందు;

పరతత్త్వ జ్ఞానము అంటే  బ్రహ్మ జ్ఞానము కలిగిన తరువాత జగమే మాయ అన్న నిజము మనకు అర్థమౌతుంది- విశ్వము లేదు అనడములో అర్థము అదే ఈ విశ్వములో కనబడే వివిధ రూప జీవ జాలము అంతయూ వేరు వేరు కాదు అని బ్రహ్మమేఅని.

3 కాలత్రయే నాప్యహిరీక్షితో గుణే -
   కాలత్రయే అపి న అహి ఇరీక్షితో గుణే -
   మూడు కాలములలోను పాము కనపడదు గదా తాడులో;

 వస్తురూపము తెలియడానికి సమ్యక్ జ్ఞానము ( సరి అయిన జ్ఞానము) కావాలి అని ముందు విన్నమాట;  మనస్సులో బ్రాన్తివలన పాము వలె కనపడిన తాడు - దీపము తీసుకు వచ్చినతరువాత ( జ్ఞానము వచ్చిన తరువాత) అది పాము కాదు తాడే అని నిర్ధారణ అవుతుంది.

4 న హి అంబుబిన్దుః  మృగతృష్ణికాయామ్  -
   ఒక నీటి బిందువు కూడా ఉండదు కదా ఎండమావులలో;

రెండవ దృష్టాంతము దూరమునుంచి కనపడే నీటిబిందువు , ఎండమావులలో దగ్గర చేరినప్పుడు నీటి బిందువు లేదు గదా.

అంటే , జానము వచ్చిన తరువాత ఎలాగ  మూడు కాలములలోను తాడులో కనపడిన పాము లేదో ; దూరము నుంచి కనపడిన నీటి బిందువు ఎండమావులలో ఎడారిలో లేదో, - అలాగే -    పరతత్త్వ జ్ఞానము వచ్చిన తరువాత విశ్వము లేదు అని గురువు భావము

405 వ శ్లోక తాత్పర్యము:

నిర్వికల్పమైన ( విభిన్నత్త్వము లేని) సత్ స్వరూపమైన పరబ్రహ్మమునందు ( అభాసరూపమైన) ఈ విశ్వము ఎప్పుడునూ ( ఏ కాలమందు) లేదు. తాడులో  సర్పము మూడుకాలములలో ఎప్పుడును లేదు. అట్లే ఎండమావులందు ( ఏ కాలమందు కూడా) ఒక్క నీటి బిందువు లేదు. ( ఈ సర్పము ఈ నీరు ఇవి భ్రమ వలన కనిపించునవి - వాటికి ఉనికి లేదు) ( అట్లే ఈ విశ్వము ఎప్పుడును లేదు.ఎల్లకాలమందు సర్వత్ర అంటే అన్ని చోట్లా బ్రహ్మము మాత్రమే ; భ్రమ వలన ఉన్నట్లు తోచు చున్న ఈ విశ్వము , భ్రమ తొలగి పోగానే అంతరించును. అప్పుడు నిజ తత్త్వము , ఈ భ్రమలన్నిటికి అధారభూతమైన అద్వయ పరబ్రహ్మము ఒక్కటే విదితమౌవును.అటి అవగాహన నిశ్చలతత్త్వ సమాధి యందు లకలుగును.)

శ్లోకము 406

మాయామాత్రమిం ద్వైతం అద్వైతం పరమార్ధతః।
ఇతి బ్రూతే శ్రుతిః సాక్ష్యాత్ సుషుప్తావనుభూయతే॥

1 మాయామాత్రమిం ద్వైతం  -
ఈ ద్వైతము మాయ మాత్రమే;

2 అద్వైతం పరమార్ధతః -
వాస్తవముగా వున్నది అద్వైతమైన బ్రహ్మమే;

ఈ దృశ్యరూపములో కనపడే భిన్నత్త్వము ( ద్వైతము) మాయ మాత్రమే: వాస్తవముగా వున్నది భేదరహితమైన అద్వితీయమైన ఎకవస్తువు బ్రహ్మమే;

3 ఇతి బ్రూతే శ్రుతిః  -
అలా అని శ్రుతులు చెప్పుచున్నవి;

4 సాక్ష్యాత్ సుషుప్తౌ అనుభూయతే- 
ప్రత్యక్షముగా సుషుప్తి యందు అనుభవీంచబడుతున్నది కదా;

మనకి గాఢనిద్రలో భిన్నత్వము ఏమీ కనపడదు గదా - లేచిన తరువాత తెలిసేమాట మంచి నిద్రపట్టినది కదా అని మాత్రమే

406 వ శ్లోక తాత్పర్యము:

అద్వయమైన పరమాత్మయందు విభిన్నత్త్వము మాయ వలన కలిగినది మాత్రమే. ఈ విధముగా సాక్షాత్తు శ్రుతులే చెప్పుచున్నవి. గాఢనిద్రలో మన అనుభవము కూడా  అదే ( గాఢ నిద్రలో విభిన్నత్త్వము గోచరించదు

||om tat sat||
_________________________________________________________

Let us think about deep sleep:

When one asks a man after deep sleep - the answer is that he does not know anything;That he knows he had a good sleep implies that the witness which is his Self is aware while all other functions are asleep. if the witness being aware, if there is anything else ( imaginary world) it would be seen too.  thus there is none other than or distinct from Self which thw witness(Self) can see. ( Thus -There is nothing to be nagated in a deep sleep)

The negation of the seen world is a feature of waking world and and

విక్షేప శక్తి is the projecting power of mind

ఆవరణ శక్తి - power of concealment - Maya cancels the true self and projects non-Self

 

__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345
వివేక చూడామణి శ్లోకములు 346-349
వివేక చూడామణి శ్లోకములు 350-353
వివేక చూడామణి శ్లోకములు 354-356
వివేక చూడామణి శ్లోకములు 357-360
వివేక చూడామణి శ్లోకములు 361-363
వివేక చూడామణి శ్లోకములు 364-366
వివేక చూడామణి శ్లోకములు 367-370
వివేక చూడామణి శ్లోకములు 371-373
వివేక చూడామణి శ్లోకములు 374-376
వివేక చూడామణి శ్లోకములు 377-380
వివేక చూడామణి శ్లోకములు 381-383
వివేక చూడామణి శ్లోకములు 384-386
వివేక చూడామణి శ్లోకములు 387-390
వివేక చూడామణి శ్లోకములు 391-393
వివేక చూడామణి శ్లోకములు 394-396
వివేక చూడామణి శ్లోకములు 397-400
వివేక చూడామణి శ్లోకములు 401-403
వివేక చూడామణి శ్లోకములు 404-406

Om tat sat !

 

 

 

    •