!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 421-423

  
వివేక చూడామణి శ్లోకములు 421- 423

గురువు ఆత్మ జ్ఞానఫలము గురించి ఇంకా చెపుతాడు ఈ మూడు శ్లోకాలలో

శ్లోకము 421
నివృత్తిః పరమాతృప్తిః
ఆనన్దో అనుపమఃస్వతః।
దృష్టదుఃఖేష్వనుద్వేగః
విద్యాయాః ప్రస్తుతం ఫలమ్॥421॥

1నివృత్తిః పరమాతృప్తిః -
నివృత్తితో గొప్ప తృప్తియు;

నివృత్తి అంటే సకలకార్యములనుండి మరలుట; సకల కార్యములు అంటె బంధము కలిగించే పనులు; బంధము కలిగించే పనుల నుంచి వెనక్కి మరలితే,  అంటే నివృత్తితో,  పరమ శాంతి పరమ తృప్తి లభిస్తాయి.

2 ఆనన్దో అనుపమః స్వతః -
స్వతస్సిద్ధమగు సాటిలేని ఆనందము;

3 దృష్టదుఃఖేష్వనుద్వేగః :
 ప్రాప్తించుచున్న దుఃఖముల విషయమున మనస్సులో బాధపడకుండుట;

4 విద్యాయాః ప్రస్తుతం ఫలమ్ -
(ఇవి) విద్యయొక్క లభించు ఫలములు

విద్య అంటే ఆత్మ జానము అని. ఆత్మ జ్ఞానము వున్నవాడికి వచ్చే లాభాలు చెప్పడమైనది. ఆ లాభాలు -  నివృత్తితో తృప్తి , స్వతః సిద్ధమగు సాటిలేని ఆనందము, దుఃఖాలలో బాధపడకుండావుండుట.  

421 శ్లోక తాత్పర్యము:

నివృత్తితో గొప్ప తృప్తి, స్వతస్సిద్ధమగు సాటిలేని ఆనందము, ప్రాప్తించుచున్న దుఃఖముల విషయమున మనస్సులో బాధపడకుండుట, ఇవి విద్యయొక్క ఫలములు.॥421॥

శ్లోకము 422

యత్కృతం భ్రాన్తివేళాయాం
నానాకర్మ జుగిప్సితమ్ ।
పశ్చాన్నరో వివేకేన
తత్ కథం కర్తుమర్హతి॥422॥

1 నానాకర్మ జుగిప్సితమ్ -
జుగిప్స కలిగించు అనేక కర్మలు;

2 యత్కృతం భ్రాన్తివేళాయాం -
భ్రాన్తి సమయములో ఎవి చేయబడినవో

3 పశ్చాన్నరో వివేకేన-
ఆ తరువాత నరుడు వివేకముతో;

4 తత్ కథం కర్తుమర్హతి -
అవి ఎట్లు చేయగలడు?

అంటే వివేకము వచ్చిన తరువాత జుగిప్స కలిగించు కర్మలు, వివేకము గలవాడు  ఎట్లు చేయగలడు అన్న ప్రశ్న కి సమాధానము, వివేకము గలవాడు చెయ్యడు అని.

వివేకము గల నరుడు భ్రాన్తి సమయములో చేసిన జుగిప్స కలిగించు కార్యములు, ఆ భ్రాన్తి పోయిన తరువాత ,  ఆ పనులను చేయలేడు.

422 వ శ్లోక తాత్పర్యము

వివేకము గల నరుడు భ్రాన్తి సమయములో చేసిన జుగిప్స కలిగించు కార్యములు, ఆ భ్రాన్తి నివృత్తితో ఆ పనులను చేయలేడు.॥422॥

శ్లోకము 423

విద్యాఫలం స్యాత్ అసతో నివృత్తిః
ప్రవృత్తిః అజ్ఞాన ఫలమ్ యదీక్క్।
తత్ జ్ఞాజ్ఞయోః మృగతృష్ణికాదౌ
నోచేత్ విదో దృష్టఫలం కిమ్ అస్మాత్॥

1 విద్యాఫలం స్యాత్ అసతో నివృత్తిః -
లేని దాని గురించి వెనుకకి మళ్ళుట విద్యయొక్క ఫలము:

విద్యవలన అంటే జ్ఞానము వలన ఫలము అసద్వవస్తువుల ( ఇ జగత్తు మాయ అనే భావముతో) నుంచి మనస్సు వెనుకకి మళ్ళుట అదే నివృత్తి. 

2 ప్రవృత్తిః అజ్ఞాన ఫలమ్। -
ప్రవృత్తి యొక్క ఫలము అజ్ఞానము;

అజ్ఞానము వలన ఈ ప్రపంచమే నిజము అనే భావము అందులో మునిగి తేలడము (అదే ప్రవృత్తి)

3 తత్ జ్ఞాజ్ఞయోః మృగతృష్ణికాదౌ-
అది జ్ఞానులు అజ్ఞానులకు ఎండమావులలో ( కనపడును).

ఎండమావులలో జ్ఞాని భ్రాన్తి పొందడు నీరు లేదు అని చలించడు దుఃఖపడడు. అజ్ఞాని ఎండమావులలో, భ్రాన్తిలో చూచిన  నీరు కనపడక దుఃఖములో పడును.

4 నోచేత్ విదో దృష్టఫలం కిమ్ అస్మాత్ -
అలా కానిచో  జ్ఞానులకు దీనికన్న భిన్నమైన ఫలము ఏమున్నది?

జ్ఞాని ఆజ్ఞానులలో ఆ భేదము లేకపోతే , విద్యయొక్క ఫలము ఎమిటి అన్న ప్రశ్నతో, గురువు విద్యయొక్క ఫలము అదే అని తేట తెల్లము చేస్తున్నాడు.


423 వ శ్లోక తాత్పర్యము:

నివృత్తి అంటే లేని దాని గురించి వెనుకకి మళ్ళుట విద్యయొక్క ఫలము. ప్రవృత్తి యొక్క ఫలము అజ్ఞానము. అది జ్ఞానులు అజ్ఞానులకు మృగతృష్ణలో  కనపడును.॥423॥


________________________________________________________



__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345
వివేక చూడామణి శ్లోకములు 346-349
వివేక చూడామణి శ్లోకములు 350-353
వివేక చూడామణి శ్లోకములు 354-356
వివేక చూడామణి శ్లోకములు 357-360
వివేక చూడామణి శ్లోకములు 361-363
వివేక చూడామణి శ్లోకములు 364-366
వివేక చూడామణి శ్లోకములు 367-370
వివేక చూడామణి శ్లోకములు 371-373
వివేక చూడామణి శ్లోకములు 374-376
వివేక చూడామణి శ్లోకములు 377-380
వివేక చూడామణి శ్లోకములు 381-383
వివేక చూడామణి శ్లోకములు 384-386
వివేక చూడామణి శ్లోకములు 387-390
వివేక చూడామణి శ్లోకములు 391-393
వివేక చూడామణి శ్లోకములు 394-396
వివేక చూడామణి శ్లోకములు 397-400
వివేక చూడామణి శ్లోకములు 401-403
వివేక చూడామణి శ్లోకములు 404-406
వివేక చూడామణి శ్లోకములు 407-410
వివేక చూడామణి శ్లోకములు 411-413
వివేక చూడామణి శ్లోకములు 414-416
వివేక చూడామణి శ్లోకములు 417-420
వివేక చూడామణి శ్లోకములు 421-423

Om tat sat !

 

 

 

    •