!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 427-430

  

వివేక చూడామణి శ్లోకములు 427- 430

"బ్రహ్మాకారా.. " అన్న 426 వ శ్లోకములో జీవన్ముక్తుడి గురించి విన్నాము;

జీవన్ముక్తుడు ఎల్లప్పుడు బ్రహ్మాకారమై ( బ్రహ్మ భావముతో) బ్రహ్మము యందు స్థిరమైన బుద్ధి కలవాడై వుండును. బ్రహ్మత్వముతో బుద్ధి బాహ్యవిషయముల మీదకు పోని వాడై వుండును ; నిద్రపోవుచున్నవాని వలెను, బాలునివలెను, ఇతరులుచే సమర్పింపబడిన ఆహారమే భోగముగా కలవాడై వుండును. ఈ లోకమును  స్వప్నములో చూడబడిన లోకమువలె  మిథ్యా రూపముగా చూచుచూ, జీవన్ముక్తుడు మెలుకువగా వుండును; బ్రహ్మత్వము వలన ఆనంతమైన పుణ్యఫలము అనుభవించుచున్న అతడు జీవన్ముక్తుడు. ఆ జీవన్ముక్తుడే భువిలో ధన్యుడైన మాన్యుడు.

ఇక్కడ మూడు శ్లోకాలలో ఆ జీవన్ముక్తుడి గుణములు గురించి ఇంకా వింటాము


శ్లోకము  427

స్థితప్రజ్ఞో యతిరయం
యః సదానన్దమశ్నుతే।
బ్రహ్మణ్యేవ విలీనాత్మా 
నిర్వికారో వినిష్క్రియః॥ 427॥

1 స్థితప్రజ్ఞో యతిః అయం-
   అయం యతిః స్థితప్రజ్ఞః-
   ఆ యతి స్థితప్రజ్ఞుడు (అనబడును)

   ఇక్కడ గురువు స్థితప్రజ్ఞుడు అని ఎవరు అనబడతారు అన్న విషయానికి మనకి      చెపుతున్నాడు 

3 బ్రహ్మణ్యేవ విలీనాత్మా -
  బ్రహ్మములోనే విలీనమైన అంతః కరణము కలవాడై

4 నిర్వికారో వినిష్క్రియః -
వికారములు లేనివాడై, క్రియాశూన్యుడైనవాడై

2 యః సదానన్దమశ్నుతే - యః సదా అనందం అశ్నుతే -
  ఎవరు ఎల్లప్పుడు ఆనందము పొందునో

అంటే బ్రహ్మములోనే విలీనమైన అంతః కరణము కలవాడై, వికారములు లేనివాడై  క్రియాశూన్యుడై,  ఎవరు ఎల్లప్పుడు ఆనందము పొందునో - అట్టివాడే స్థితప్రజ్ఞుడు !

భగవద్గీతలో, "స్థితప్రజ్ఞస్య కా భాష స్థితధీః కిమ్ ఉచ్యతే" అన్న అర్జునిది ప్రశ్న విన్నాము. ఇక్కడ ప్రస్థావన ఆ స్థితప్రజ్ఞుడి గురించే.

427 వ శ్లోక తాత్పర్యము:

"ఎవరు బ్రహ్మములోనే విలీనమైన అంతః కరణము కలవాడై, వికారములు లేనివాడై  క్రియాశూన్యుడై,  ఎల్లప్పుడు ఆనందము పొందునో - అట్టివాడు స్థితప్రజ్ఞుడు".

శ్లోకము  428

బ్రహ్మాత్మనోః శోధితయోరేక భావావగాహినీ।
నిర్వికల్పా చ చిన్మాత్రవృత్తిః ప్రజ్ఞేతి కథ్యతే।
సా సర్వదా భవేత్ యస్య స జీవన్ముక్త ఉత్యతే॥

1 బ్రహ్మాత్మనోః శోధితయోః ఏక భావ అవగాహినీ -
     బ్రహ్మాత్మనోః శోధితయోః - బ్రహ్మము జీవాత్మల యొక్క శోధించబడిన
     ఏక భావ అవగాహినీ - (వాటి) ఏకత్వమును తెలియపరుచు
 
     మనకి జీవాత్మ పరమాత్మలయొక్క ఏకత్వము మనకి స్ఫురించేది మన మనస్సుచే ప్రేరేపింపబడిన బుద్ధి  ద్వారా. ఆ మనోవృత్తి గురించి గురువు చెప్పుచున్నాడు రెందవపాదములో 

2  నిర్వికల్పా చ చిన్మాత్రవృత్తిః ప్రజ్ఞేతి కథ్యతే
     నిర్వికల్పా చ చిన్మాత్రవృత్తిః - నిర్వికల్పమైన చిన్మాత్ర వృత్తి
     ప్రజ్ఞేతి కథ్యతే - ప్రజ్ఞ అని చెప్పబడుచున్నది;

     చిన్మాత్ర వృత్తి అంటే శుద్ధ జ్ఞాన స్వరూపమైన మనో వృత్తి
    నిర్వికల్పమైన చిన్మాత్ర వృత్తి  అంటే - ఏమీ వికారములు లేని శుద్ధ జ్ఞాన స్వరూపమైన మనో వృత్తి అని.
    
     ఆ నిర్వికల్పమైన చిన్మాత్ర వృత్తి, అదే వికారములు లేని శుద్ధ జ్ఞాన స్వరూపమైన మనో వృత్తిని  మనకి బ్రహ్మము జీవాత్మల యొక్క ఏకత్వమును తెలియపరుస్తుంది.

అట్టి శుద్ధ జ్ఞాన స్వరూపమైన మనో వృత్తి, ప్రజ్ఞ అని చెప్పబడుచున్నది.

ఎవరికైనా ప్రజ్ఞ వుంది అంటే - ఆ విషయము వాడి బుర్రలో క్షుణ్ణముగా తెలుసు అని మన సామాన్య వాడుక. అదే అధ్యాత్మిక రంగములో బ్రహ్మము జీవాత్మల యొక్క ఏకత్వమును తెలియపరుచు బుద్ధి (మనో వృత్తి) ప్రజ్ఞ అని. ఆ మనో బుద్ధి వికారములు లేనిది జ్ఞాన స్వరూపమైనది.

3 సా సర్వదా భవేత్ యస్య స జీవన్ముక్త ఉత్యతే

సా సర్వదా భవేత్ యస్య-
అట్టి( చిత్తవృత్తి) ఎవరికి ఎల్లప్పుడు వుండునో
స జీవన్ముక్త ఉత్యతే -
అతడు జీవన్ముక్తుడు అనబడును.

అట్టి చిత్తవృత్తి ఎవరికి ఎల్లప్పుడు వుండునో అతడు జీవన్ముక్తుడు అనబడును

428 వ శ్లోక తాత్పర్యము:

బ్రహ్మము జీవాత్మల యొక్క ఏకత్వమును తెలియపరుచు, వికారములు లేని శుద్ధ జ్ఞాన స్వరూపమైన మనో వృత్తిని ప్రజ్ఞ అని చెప్పబడుచున్నది. అట్టి చిత్తవృత్తి ఎవరికి ఎల్లప్పుడు వుండునో అతడు జీవన్ముక్తుడు అనబడును


శ్లోకము  429

యస్య స్థితా భవతి ప్రజ్ఞా యస్యానన్దో నిరన్తరః।
ప్రపఞ్చో విస్మృత ప్రాయః స జీవన్ముక్త  ఇష్యతే॥

1 యస్య స్థితా భవతి ప్రజ్ఞా-
  ఎవరు తన ప్రజ్ఞలో (స్థిరముగా) నిలబడి వున్నాడో
2 యస్య ఆనన్దః నిరన్తరః -
ఎవరు నిరంతరముగా అనందములో వున్నాడో
3 ప్రపఞ్చో విస్మృత ప్రాయః -
(ఎవరికి) ప్రపంచము నిమిత్తమాత్రమే అయినదో

4 స జీవన్ముక్త  ఇష్యతే -
అతడు జీవన్ముక్తుడు అనబడును

429 వ శ్లోకము తాత్పర్యము:

ఎవరు తన ప్రజ్ఞలో (స్థిరముగా) నిలబడి వున్నాడో, ఎవరు నిరంతరముగా అనందములో వున్నాడో, ప్రపంచము నిమిత్తమాత్రమే అయినదో, అతడు జీవన్ముక్తుడు అనబడును

విస్మృతప్రాయః - అంటే మరవబడినదా అన్నట్లు ; ప్రపంచో విస్మృతప్రాయః అంటే (జీవన్ముక్తుడు) వేరే ప్రపంచము వున్నది అని మరచిపోయాడా అన్నట్లు కనిపిస్తాడు అన్నమాట.

వేరే ప్రపంచము వున్నది అని మరచిపోయాడా అన్నట్లు కనిపిస్తాడు అంటే - ప్రపంచము ప్రపంచ విషయాలు స్థిత ప్రజ్ఞుడికి అలజడి కలిగించవు అన్నమాట. అంటే మరి ఏమీచెయ్యకుండా కూర్చునే వుంటాడు అని మన ఉపసిద్ధంతము( corrolary) కాదు. భగవద్గీతలో జనకాదయః అంటూ జనకుడు మున్నగువారు ( జీవన్ముక్తులు) లోకసంగ్రహముకోసము తమ కర్మలు నిర్వహించారు

శ్లోకము  430

లీనధీరపి జాగర్తి యోజాగ్రత్ ధర్మవర్జితః।
బోధో నిర్వాసనో యస్య స జీవన్ముక్త ఇష్యతే

   లీనధీరపి జాగర్తి యోజాగ్రత్ ధర్మవర్జితః
1 లీనధీరపి జాగర్తి -
  లీనమైన బుద్ధి కలవాడైననూ  మెలుకువగా వుండువాడు;

  బ్రహ్మములో లీనమైన బుద్ధి కలవాడైననూ , మెలుకువగా వున్నవాడి ప్రత్యేకత చెపుతున్నాడు గురువు;  బ్రహ్మములో లీనమైన వాడు బాహ్యప్రపంచములో వుండడు. బ్రహ్మములోనే లీనమై వుంటాడు. జీవన్ముక్తుడు బ్రహ్మములో లీనమైనను మెలుకువగా వుంటాడు.

2 యోజాగ్రత్ ధర్మవర్జితః -
   ఎవరు జాగ్రదావస్థకు సంబంధించిన ధర్మములు లేనివాడై;

అంటే మెలుకువగా వున్నా, జాగ్రదావస్థకు సంబంధించిన ధర్మములు లేనివాడు అని. అంటే,  జాగ్రదావస్థలో వున్ననూ, అతడు అనాత్మ రూపమైన స్థూలశరీర అభిమానము లేనివాడు అన్నమాట.

మొదటి పాదములో గురువు జీవన్ముక్తుడి గుణము చెప్పుచున్నాడు. (బ్రహ్మములో) లీనమైన బుద్ధి కలవాడైననూ, జాగ్రదావస్థకు సంబంధించిన ధర్మములు లేనివాడై మెలుకువగావున్నవాడు అని,

రెండవపాదము:
బోధో నిర్వాసనో యస్య స జీవన్ముక్త ఇష్యతే

3 బోధో నిర్వాసనో యస్య -
   ఎవరి జ్ఞానము వాసనారహితమో

4 స జీవన్ముక్త ఇష్యతే -
   అట్టివాడు జీవన్ముక్తుడు అనబడును

ఇది ఇంకో గుణము. పూర్వజన్మ సుకృత దుష్కృతాలవలన ఆ పాపపుణ్యాలు, వాసనారూపములో మనతో కూడా వుంటాయి. బ్రహ్మజీవైక ఏకత్వము తెలిపిన మనో వృత్తి ద్వారా - అంటే ఆ ప్రజ్ఞద్వారా జీవుడు వాసనారహితుడు అవుతాడు.  అలా ఎవరి జ్ఞానము వాసనారహితమో అట్టివాడు జీవన్ముక్తుడు అనబడును.

తాత్పర్యము:

లీనమైన బుద్ధి కలవాడైనూ ఎవరు జాగ్రదావస్థకు సంబంధించిన ధర్మములు లేనివాడై వుండునో, ఎవరి జ్ఞానము వాసనారహితమో, అట్టివాడు జీవన్ముక్తుడు అనబడును॥

॥ఒమ్ తత్ సత్॥

___________________________________________________

__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345
వివేక చూడామణి శ్లోకములు 346-349
వివేక చూడామణి శ్లోకములు 350-353
వివేక చూడామణి శ్లోకములు 354-356
వివేక చూడామణి శ్లోకములు 357-360
వివేక చూడామణి శ్లోకములు 361-363
వివేక చూడామణి శ్లోకములు 364-366
వివేక చూడామణి శ్లోకములు 367-370
వివేక చూడామణి శ్లోకములు 371-373
వివేక చూడామణి శ్లోకములు 374-376
వివేక చూడామణి శ్లోకములు 377-380
వివేక చూడామణి శ్లోకములు 381-383
వివేక చూడామణి శ్లోకములు 384-386
వివేక చూడామణి శ్లోకములు 387-390
వివేక చూడామణి శ్లోకములు 391-393
వివేక చూడామణి శ్లోకములు 394-396
వివేక చూడామణి శ్లోకములు 397-400
వివేక చూడామణి శ్లోకములు 401-403
వివేక చూడామణి శ్లోకములు 404-406
వివేక చూడామణి శ్లోకములు 407-410
వివేక చూడామణి శ్లోకములు 411-413
వివేక చూడామణి శ్లోకములు 414-416
వివేక చూడామణి శ్లోకములు 417-420
వివేక చూడామణి శ్లోకములు 421-423
వివేక చూడామణి శ్లోకములు 421-423
వివేక చూడామణి శ్లోకములు 421-423

Om tat sat !

 

 

 

    •